స్ఫూర్తి: కోచింగ్ లేకుండా సివిల్స్ లో ఫస్ట్ ర్యాంక్… ఇది కదా సక్సెస్ అంటే..!

-

సివిల్స్ లో క్వాలిఫై అవ్వాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు సివిల్స్ పరీక్షల్లో ఆల్ ఇండియా స్థాయి లో ఫస్ట్ ర్యాంక్ ని సొంతం చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదు. సివిల్స్ కష్టమైనది. దానికోసం ఎంతగానో కష్టపడాలి. అయితే సివిల్స్ పరీక్షలో వెంకట శ్రీకాంత్ ఆల్ ఇండియా స్థాయి లో ఫస్ట్ ర్యాంక్ ని సాధించారు. సివిల్స్ పరీక్ష క్రాక్ చేయడం సులువు కాకపోయినా కష్టంతో శ్రీకాంత లక్ష్యాన్ని సాధించి చాలా మందికి ఇప్పుడు ఆదర్శంగా నిలిచాడు బాపట్ల కి చెందిన శ్రీకాంత్ ఇంటర్ వరకు గుంటూరులో చదువుకున్నాడు.

నోయిడా లోని యూనివర్సిటీలో ఈసీఈ లో బీటెక్ పూర్తి చేశాడు. బీటెక్ అయిన తర్వాత సివిల్స్ మీద దృష్టి పెట్టాడు. ఐఎఫ్ఎస్ కావాలని అనుకుని టెలిగ్రామ్ యూట్యూబ్ సహాయంతో చదవడం మొదలుపెట్టాడు. యూట్యూబ్లో సీనియర్ సలహాలను విని పాటించేవాడు. ఇదివరకు క్వాలిఫై అయిన వాళ్ల మాటల్ని కూడా వినేవాడు. సొంతంగానే ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. 2021 వ సంవత్సరంలో ఆశించిన ఫలితాలని అందుకోలేదు.

కానీ ఈ సారి మాత్రం తొలి ర్యాంకుతో అందర్నీ ఆనందపడేలా చేశాడు కదలకుండా కూర్చుని చదువుకునే వాడినని.. సక్సెస్ కి సీక్రెట్ ఇదేనని శ్రీకాంత్ చెప్పారు చాలామంది సక్సెస్ ని అందుకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ అనుకున్నంత మాత్రాన ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వరు. దానికి తగ్గ కష్టం ప్రయత్నం చేస్తేనే ఏదో ఒక రోజు సక్సెస్ ని అందుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news