WIMBELDON 2023 : టెన్నిస్ ప్లేయర్ జోకోవిచ్ కు భారీ జరిమానా !

-

గత ఆదివారం రోజున ఇంగ్లాండ్ లో వింబుల్డన్ ఓపెన్ 2023 లో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ లో ప్రపంచ నంబర్ వన్ కార్లస్ అల్కరాజ్ ప్రపంచ నంబర్ 2 ర్యాంక్ లో ఉన్న నోవాక్ జోకొవిచ్ ను ఓడించి మొదటిసారి వింబుల్డన్ ను గెలుచున్నాడు. మాములుగా మొదటి సెట్ గెలుచుకున్న. జోకోవిచ్ గెలుస్తాడనీ అనుకున్నారు…కానీ అనూహ్యంగా పోరాడిన ఆల్కరాజ్ ఛాంపియన్ ను ఓడించి కొత్త ఛాంపియన్ గా అవతరించాడు. కాగా ఈ మ్యాచ్ లో నోవాక్ జోకొవిచ్ కు భారీగా జరిమానా పడింది. మ్యాచ్ లో భాగంగా ఒక పాయింట్ ను కోల్పోవడంతో ఆగ్రహం చెందిన జోకో ఆవేశంతో తన రాకెట్ ను నెట్ కు బలంగా కొట్టడంతో నిబంధనలు ఉల్లగించడంతో అతనికి 8000 డాలర్లు జరిమానా విధించారు.

కాగా 2023 లో ప్లేయర్ లకు విధించిన జరిమానాలలో ఇదే ఎక్కువ. ఇక ఈ జరిమానా అమౌంట్ ను జోకొ గెలిచిన రన్నర్ అప్ అమౌంట్ లో నుండి తీసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news