మీ జీవితాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే ప్రముఖులు చెప్పిన కొటేషన్లు..

-

ప్రేరణ.. మనిషికి చాలా అవసరం. ఒక పని ఎందుకు చేస్తున్నామో, ఎవరి కోసం చేస్తున్నామో తెలిస్తే దాన్నుండి వచ్చే ఫలితానికి కిక్కు ఎక్కువగా ఉంటుంది. మరి ఆ పని చేయడానికి ఏదో ఒకటి పురికొల్పాలి. అలా పురికొల్పే కొన్ని సూక్తులని ఇక్కడ తెలుసుకుందాం. జీవితాన్ని మరింత అందంగా, ఆనందంగా తీర్చిదిద్దుకోవడానికి ఈ సూక్తులు బాగా పనిచేస్తాయి.

ఇతరుల తప్పుల నుండి నువ్వు తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే అన్నీ తప్పులు చేయడానికి నీ జీవితం సరిపోదు కాబట్టి- రూజ్ వేల్డ్

నువ్వు సరైన దారిలోనే ఉన్నా ఖచ్చితంగా పరుగెత్తు.. కూర్చుంటే విజయం నీ దరికి రాదు- విల్ రోగర్స్

ప్రతీరోజూ మంచిదే కాకపోవచ్చు. కానీ ప్రతీరోజులో ఎంతో కొంత మంచి ఉంటుంది -అలైస్ మోర్సే

మార్పు తీసుకురావడానికి నేను చాలా చిన్నవాడిని అనుకుంటున్నావా? ఐతే ఒక్కసారి దోమని గుర్తు తెచ్చుకో- దలైలామా

మనం మనల్ని ఎలా తయారు చేసుకుంటున్నామనేది మనం చేసే పనుల మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు స్ట్రాంగ్ గా తయారవుతున్నావా, వీక్ గా తయారవుతున్నావా అనే దానికి నీ పనులే కొలమానం

జీవితం చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ మనమే దానికి అనవసరమైనవి జోడించి కాంప్లికేటెడ్ చేసుకుంటున్నాం- కన్ఫ్యూషియస్

Read more RELATED
Recommended to you

Exit mobile version