ఇన్ స్టంట్ లోన్ యాప్ ల ద్వారా లోన్ లు తీసుకోకండి.. మరొకరు బలి ?

-

ఒకప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవాలి అంటే ఎంతో ప్రాసెస్ ఉండేది. కానీ ప్రస్తుతం కేవలం నిమిషాల వ్యవధిలోనే పర్సనల్ లోన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నేటి రోజుల్లో ఎంతోమంది నెటిజన్లకు పర్సనల్ అందించేందుకు ఎన్నో రకాల యాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. చిన్న చిన్న మొత్తాలలో లోన్ అందిస్తూ ఆ తరువాత ఏకంగా పెద్ద మొత్తాలను అందించేందుకు కూడా సిద్ధం అవుతున్నాయి ఎన్నో యాప్స్. ప్రస్తుతం ఎంతో మంది చిన్న చిన్న యాప్స్ ఉపయోగించుకుని పర్సనల్ లోన్స్ పొందుతున్న వారు కూడా ఉన్నారు.

అయితే ఈ ఇన్ స్టంట్ లోన్ యాప్ లు ప్రాణాలు మీదకు తెస్తున్నాయి. స్నాప్ ఇట్ అనే యాప్ ద్వారా సిద్దిపేట రాజ గోపాల్ పేటకి చెందిన మౌనిక లోన్ తీసుకుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఏఈఓగా పని చేస్తున్న మౌనిక వాయిదాలు చెల్లించక పోవడంతో డీ పాల్టర్ గా గుర్తించి ఫోటో, మొబైల్ నెంబర్, పేరుతో కూడిన ప్రొఫైల్ ను వాట్సాప్ గ్రూప్ లలో గ్రూప్ నిర్వాహకులు షేర్ చేశారు. మనస్తాపం తో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం, చికిత్స పొందుతూ మృతి చెందింది మౌనిక. 

Read more RELATED
Recommended to you

Exit mobile version