అల్లు అర్జున్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. మోహరించిన పోలీసులు

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏప్రిల్ 8 బన్నీ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు భారీగా ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో అక్కడంతా సందడి నెలకొంది. దీంతో జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భారీ కేడ్లను కూడా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం..

అభిమానులు అల్లు అర్జున్‌కు విషెస్ చెప్పేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు నానా తంటాలు పడుతున్నారు.ఇదిలాఉండగా, బన్నీ తన కొత్త సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చాడు.అందరూ ఊహించినట్లుగానే తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు అల్లు అర్జున్.ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news