వరంగల్ జిల్లాలో నేనే టాల్ లీడర్ – కడియం శ్రీహరి

-

వరంగల్ జిల్లాలో నేనే టాల్ లీడర్ అన్నారు కడియం శ్రీహరి.  14 ఏళ్లు మంత్రిగా పనిచేశా. 4 సార్లు ఎమ్మెల్యే , ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్సీగా పని చేశా. వరంగల్ జిల్లాలో నేనే టాల్ లీడర్‌ను అని వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపణలను తిప్పికొట్టిన కడియం శ్రీహరి… నేను అటవీ భూములను ఆక్రమించుకున్నట్లు నాపై తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఒకవైపు రైతుల పట్టా భూములు, అటవీ భూములను రక్షించాలని నేను ప్రయత్నిస్తుంటే నాపైనే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Kadiyam Srihari refutes BRS MLA Palla Rajeshwar Reddy’s allegations

ఈ ఆరోపణలకు వివరణ ఇవ్వాలంటే నాకే సిగ్గుగా అనిపిస్తుందని చురకలు అంటించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. నా పేరుమీద 2వేల ఎకరాలు ఉంటే వరంగల్ జిల్లాలో ఉన్న మీడియా మిత్రులందరికీ మనిషికి 20 ఎకరాలు రాసిస్తా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు కడియం శ్రీహరి.  ఎకో టూరిజంగా దేవునూర్ గుట్ట భూములు… అటవీ భూముల సంరక్షణకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. దేవునూర్ గుట్టల్లో ఉన్న భూములను ఎకో టూరిజంగా డెవలప్ చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news