ఇంటర్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోక పోతే ఇంటర్ ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలకు మా సెంటర్ లను ఇవ్వమని ఇంటర్ బోర్డు అధికారులకు వినతి పత్రం ఇచ్చాయి ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాలు. అయితే ఈ మధ్యే విద్యార్థులకు నేరుగా హల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్ ఇంటర్ బోర్డు ఇవ్వగా.. దానిని తొలగించాలి అని కాలేజీ యాజమాన్యాలు కోరాయి.
అదే విధంగా ఎగ్జామ్ ఫీ ఆలస్య రుసుం ప్రతి విద్యార్థి నుండి 2,500 రూపాయలు చెల్లించాలనే దాన్ని ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఇప్పటికే పెనాల్టీలు కట్టి ఇబ్బందుల్లో ఉన్న తమకు సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశించడంతో తమ ఆర్థికంగా భారం పడుతుంది అని.. అందుకే సీసీ కెమెరాలు పెట్టలేము అని తెలుపుతున్నాయి యాజమాన్యాలు. ఈ అంశాల పై తమకు సానుకూల నిర్ణయం తీసుకోక పోతే ఎగ్జామ్ సెంటర్ లుగా మా కాలేజీలు ఇవ్వము అని ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ పేర్కొన్నారు.