చంద్రబాబు ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఫీజులు చెల్లించటంలో విఫలమయ్యారు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవటంతో యాజమాన్యాలు విద్యార్ధులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. పేద విద్యార్ధుల కళాశాలలకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. చంద్రబాబు ఫీజులు చెల్లించకపోవటంతో విద్యార్ధులు కూలీలుగా మారిపోయే అవకాశం ఉంది.
అయితే చంద్రబాబు అద్భుతమని బాగా ఊదిన నేతలు ఇప్పుడు మాట్లాడటం లేదు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసారు చంద్రబాబు. అయితే పెద్ద ఎత్తున విద్యార్దులు, వారి తల్లిదండ్రులతో కలసి కలెక్టర్లకు మొదటి ప్రయత్నంగా వినతి పత్రం ఇచ్చారు. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు విద్యా శాఖ మంత్రి లోకేష్ ఫీజులు చెల్లించే వరకు పోరు ఆగదు. ఎనిమిది నెలల్లో చెప్పిన హామీలను వదిలేసింది కూటమి ప్రభుత్వం. అయితే చంద్రబాబును 420 అంటే గందరగోళం చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు మాట్లాడాలి అని అంబటి రాంబాబు అన్నారు.