రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభం

-

రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ విద్యాశాఖ అధికారులు సన్నద్ధం అయ్యారు. ఇప్పటికే కనీస మార్కులతో విద్యార్థులను ప్రభుత్వం పాస్‌ చేసినప్పటికీ మార్కుల శాతాన్ని పెంచుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది సర్కార్‌. బెటర్‌ మెంట్‌ రాసి ఎక్కువ మార్కులు సాధించుకునే వెసులు బాటు కల్పించింది.

ఇందులో భాగంగా నే రేపటి నుంచి ఈ నెల 23 వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులు మరియు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు సెకండీయర్‌ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రశ్నా పత్రరాలను పోలీస్‌ స్టేషన్‌ లో భద్ర పరిచారు అధికారులు. ఇక ఈ పరీక్షల్లో ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. మాస్క్‌లు మరియు సాని టైజర్‌ వాడకం తప్పని సరి అని పేర్కొన్నారు విద్యా శాఖ అధికారులు. అంతేకాదు.. మాస్క్‌లు లేని వారికి నో ఎంట్రీ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version