కలలు.. అంటే చాలామందికి ఇష్టం. మరికొందరికి భయం. అయితే మన కర్మ సిద్ధాంతంలో కలల గురించి అనేక శాస్త్రాలు ఉన్నాయి. వీటి గురించి పలు పురాణాలు, ఇతిహాసాలలో కూడా పలు ఘటనలు ఉన్నాయి. వాటి గురించిన వివరాలు, పెద్దలు, పండితులు తెలిపిన విశేషాలు తెలుసుకుందాం…
కలల పట్ల భయం అనేది మానవులకూ అనాదిగా ఉంది. అందుకు కారణం.. అన్ని కలలు శుభ ఫలితాలను ఇవ్వవు. పురాణాల్లోనూ కలలకు సంబంధించిన కథలు పరిశీలిస్తే… రామాయణంలో సీతను రావణుడు అశోకవనంలో బంధించి ఉంచుతాడు. త్రిజట అనే రాక్షసిని కాపలా ఉంచుతాడు. ఒక రోజు ఆ రాక్షసి కలలో రాముడు కనిపించి ఒక వానరం వచ్చి వనమంతా చెరిచి, లంకాదహనం చేస్తుందని చెప్పాడు. ఆ తర్వాత జరిగింది. ఇది రామాయణంలో త్రిజట స్వప్నము అనే పద్యంలో ఉంది.
కలలో సముద్రం కనిపిస్తే కష్టాలు వస్తాయని శాస్త్రం చెబుతోంది. నాట్యం చేస్తున్నట్టు, నవ్వినట్టు, గీతాలను పాడినట్టు, వీణ తప్ప మిగిలిన వాద్యాలను తాను వాయించినట్టు కల రావటం మంచిది కాదు. నదిలో మునిగి కిందికి పోవటం, బురద, సిరా కలిసిన నీళ్ళతో స్నానం చేయటం అశుభ శకునాలు.