చార్‌కోల్ అనగానే సహజంగా చాలా మంది మన ఇండ్ల వద్ద లభ్యమయ్యే బొగ్గు అనుకుంటారు. అయితే అది చార్‌కోల్ అనే మాట నిజమే.. కానీ దాన్ని మనం ఆరోగ్యకర ప్రయోజనాలకు వాడలేం. యాక్టివేటెడ్ చార్‌కోల్‌ను మాత్రమే వాడుకోగలం. దాన్ని బొగ్గు, కొబ్బరికాయ టెంక, వెదురు తదితరాలతో తయారు చేస్తారు. ఇక మనకు యాక్టివేటెడ్ చార్‌కోల్ ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్, పౌడర్ రూపంలో మార్కెట్‌లో లభిస్తుంది. దీంతో మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* యాక్టివేటెడ్ చార్‌కోల్‌ను మనం దంతధావనం కోసం ఉపయోగించవచ్చు. దీంతో దంతాలను నిత్యం శుభ్రం చేసుకుంటే.. దంతాలు, చిగుళ్ల సమస్యలు పోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. నోరు శుభ్రంగా మారుతుంది. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది.
* యాక్టివేటెడ్ చార్‌కోల్ ట్యాబ్లెట్లను తీసుకోవడం ద్వారా గ్యాస్, డయేరియా, ఐబీఎస్ (ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్) వంటి సమస్యలు తగ్గుతాయి.
* ఆల్కహాల్ పాయిజనింగ్ అయినవారు, హ్యాంగోవర్ ఉన్నవారు యాక్టివేటెడ్ చార్‌కోల్ తీసుకుంటే.. ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* యాక్టివేటెడ్ చార్‌కోల్‌ను తీసుకోవడం ద్వారా శరీరంలో ఉండే టాక్సిన్లు, వ్యర్థాలు బయటకు వెళ్లిపోయి.. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. శరీరంలో ఉండే పాదరసం, సీసం తదితర కెమికల్స్ బయటకు వెళ్లిపోతాయి.
* రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో యాక్టివేటెడ్ చార్‌కోల్ సమర్థవంతంగా పనిచేస్తుంది.
* క్యాన్సర్ చికిత్స తీసుకునే వారు డాక్టర్ సూచన మేరకు యాక్టివేటెడ్ చార్‌కోల్ వాడితే చాలా వరకు ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
* చర్మాన్ని సంరక్షించడంలో, చర్మాన్ని మృదువుగా మార్చడంలో, చర్మానికి సౌందర్యాన్ని అందించడంలో యాక్టివేటెడ్ చార్‌కోల్ బాగా పనిచేస్తుంది. అలాగే పురుగులు కుట్టినా, పాము కాటు వేసినా, ఇతర సమస్యల వద్ద దద్దుర్లు వచ్చినా.. వాటికి గాను యాక్టివేటెడ్ చార్‌కోల్‌ను ఉపయోగించవచ్చు.