ఈ యాప్ ఉందా.. అయితే మీరు సేఫ్‌..!

-

మీరు అర్జంట్ మీటింగ్‌లో ఉన్నారు.. అప్పుడు మీకు ఓ కాల్ వ‌స్తుంది. ఎంతో అర్జంట్ కాల్ అనుకుని మ‌నం లిఫ్ట్ చేస్తాము.. కానీ లిఫ్ట్ చేశాక తెలుస్తుంది. అవ‌త‌లి నుంచి ఓ ప్ర‌మోష‌న్ కాల్ అని.. అప్పుడు చికాకు.. కోపం తప్ప‌దు. ఈ బెడ‌ద నుంచి త‌ప్పుకోవ‌డం ఎలా అని ఒక‌టే ఆలోచ‌న‌.. ఇలాగే ఎస్ ఎం ఎస్‌లు వ‌స్తాయి. బాగానే ఇబ్బంది పెడ‌తాయి.. లోన్ కావాలా? క్రెడిట్ కార్డు కావాలా? ప్లాట్ కొంటారా? అంటూ మీకు తరచూ మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ వస్తున్నాయా? ఇలాంటి ఆఫర్లతో వచ్చే ఎస్ఎంఎస్‌లతో మీ ఇన్‌బాక్స్ నిండిపోతుందా? ఇలాంటి ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్‌లను మీరు అడ్డుకోవచ్చు. జియో ఫోన్‌లో అయితే ఈ ఫీచర్ చాలా సింపుల్‌గా యాక్టివేట్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

1. మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ అడ్డుకోవడానికే DND-Do not Disturb ఫీచర్ రూపొందించింది ట్రాయ్. చాలామందికి ఈ ఫీచర్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలియదు. జియో యూజర్లు చాలా సులువుగా ఈ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవచ్చు.

2. మీ దగ్గర జియో ఫోన్ ఉందా? మీరు జియో సిమ్ ఉపయోగిస్తున్నారా? అయితే DND-Do not Disturb ఫీచర్ ఇలా యాక్టివేట్ చేసుకోండి. మీ ఫోన్‌లో మై జియో యాప్ ఓపెన్ చేయండి. ఒకవేళ మీ ఫోన్ వైఫైకి కనెక్ట్ చేసినట్టైతే వైఫై డిస్ కనెక్ట్ చేసి మొబైల్ డేటా ఆన్ చేయండి.

3. లెఫ్ట్ టాప్‌లో త్రీ లైన్స్ క్లిక్ చేసి సెట్టింగ్స్ పేజీ ఓపెన్ చేయండి. అందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి.

4. సర్వీస్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అందులో Do not Disturb ఆప్షన్ కనిపిస్తుంది.

5. Do not Disturb ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మై జియో యాప్ ఓపెన్ చేయండి మీకు డూ నాట్ డిస్టర్బ్‌కి సంబంధించిన పలు సెట్టింగ్స్ కనిపిస్తాయి. అందులో FULL DND సెలెక్ట్ చేసుకుంటే ఇక మీకు ఎలాంటి ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు రావు. FULL DND కాకుండా బ్యాంకింగ్, హెల్త్, ఎడ్యుకేషన్ లాంటి వేర్వేరు ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏ ప్రమోషనల్ మెసేజెస్, కాల్స్ అవసరం లేదనుకుంటే ఆ ఆప్షన్ ఆఫ్ చేయాలి.

6. మీ సెట్టింగ్స్ పూర్తైన తర్వాత డీఎన్‌డీ రిక్వెస్ట్ వెళ్తుంది. రిఫరెన్స్ నెంబర్ మెయిల్, ఎస్ఎంఎస్ వస్తాయి. వారం రోజుల్లో మీ డీఎన్‌డీ యాక్టివేషన్ పూర్తవుతుంది. Do not Disturb యాక్టివేట్ అయిన తర్వాత మీకు ప్రమోషనల్ కాల్స్, ఎస్ఎంఎస్ రావు.

7. DND సర్వీస్‌ని అన్ని టెలికాం కంపెనీలు ఇస్తారు. అయితే జియో సబ్‌స్క్రైబర్లు My JIO యాప్‌ ద్వారా DND సర్వీస్‌ని సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version