అభాగ్య న‌గ‌రంగా మార‌నున్న భాగ్య‌న‌గ‌రం..రీజ‌న్ ఇదే..!

-

భాగ్య‌న‌గ‌రంగా పేరున్న ఉమ్మ‌డి రాష్ట్ర రాజ‌ధాని(మ‌రో నాలుగేళ్ల వ‌ర‌కు అవ‌కాశం ఉంది) హైద‌రాబాద్.. మ‌రో ఢిల్లీగా మార‌నుందా? ఇక్క‌డ కూడా కాలుష్య భూతం ప్ర‌జ‌ల‌ను వేధిస్తోందా? పెరుగుతున్న జ‌నాభా, వాహ‌నా లు, ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య‌లు వంటివి న‌గ‌రాన్ని ప‌ట్టి పీడిస్తున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీలకు లు. ప్ర‌స్తుతం దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాలుష్య కాసారం పెరిగిపోయింది. ప్ర‌జ‌లు మాస్కులు ధ‌రిస్తేనే త‌ప్ప ఉండ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. విద్యార్థుల నుంచి ఉద్యోగ‌స్తుల వ‌ర‌కు కాలుష్యంతో అల్లాడి పోతున్నారు. దీంతో ప్రభుత్వం ఇప్ప‌టికే స‌రి-బేసి సంఖ్య‌ల ఆదారంగానే వాహ‌నాల‌ను రోడ్ల‌పైకి అనుమ‌తిస్తోంది.

ఇప్పుడే ఇలా ఉంటే, రాబోయే ఐదేళ్ల‌లో ఢిల్లీలో మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అనేక అధ్య‌య‌నాలు వె ల్ల‌డిస్తున్నాయి. ఇప్పుడు సాక్షాత్తూ ఇలాంటిప‌రిస్థితే.. హైద‌రాబాద్ న‌గ‌రం కూడా ఎదుర్కొంటోంద‌ని అంటు న్నారు. రాష్ట్ర విభ‌జ‌న‌తో హైద‌రాబాద్ లో జ‌నాభా సంఖ్య త‌గ్గుతుంద‌ని అంచ‌నా వేసినా.. అది జ‌ర‌గ‌లేదు. పైగా గ‌డిచిన నాలుగేళ్ల‌లో 100 వేల మంది పెరిగిన‌ట్టు చెబుతున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లో చలి తీవ్రత అధికంగా ఉండటంతో స్వేచ్చగా ఊపిరి తీసుకోవడం కష్టతరమౌతోంది. అస్తమాతో బాధ పడుతున్న వారి పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రస్తుత వాతావరణం స్వైన్ ఫ్లూ కారక వైరస్ ఇతర బ్యాక్టీరియాల వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు పిల్లలు గర్భిణీల పై ఎక్కువ ప్రభావం చూపుతుంది. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు..వాహన పారిశ్రామిక కాలుష్యానికి దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 2019 నవంబర్ 22వ తేదీ శుక్రవారం నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 158గా నమోదైంది. అందులో పీఎం 2.5 పీఎం 1.0 ఉద్గారాల తీవ్రత నమోదైంది.

గాలిలో సల్ఫర్ డయాక్సైడ్ హైడ్రో కార్బన్స్ నైట్రోజన్ ఆక్సైడ్ అమ్మోనియం కార్బోమోనాక్సైడ్ వంటి రసాయనాలు కలిసిపోవడం పొగమంచులో ఇవి కలిసిపోయి శ్వాస తీసుకున్నప్పుడు అవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాస సంబంధ సమస్యలకు కారణమౌతున్నాయి. దీంతో హైద‌రాబాద్ మ‌రో ఢిల్లీ కావ‌డానికి ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌నే ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ఇంత జ‌రుగుతున్నా కేసీఆర్ ప్ర‌భుత్వం మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి రాబోయే రోజ‌ల్లో ప్ర‌జ‌లే పూనుకుని కాలుష్యానికి చెక్ పెడ‌తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version