మోడీ అంటే బాబు నోరు పెగ‌లెట్లేదెందుకు…?

-

ఏపీ మాజీ సీఎం, ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్‌ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబు తాజాగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి లేఖ రాశారు. దీనిలోనూ ఆయ‌న కొత్త‌గా చెప్పింది ఏమీలేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని విమ ‌ర్శించే క్ర‌మంలో ఇదొక మార్గ‌మ‌ని ఆయ‌న‌ను ఉద్దేశించి వినిపిస్తున్న విమ‌ర్శ‌లు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభు త్వం  ‘‘పెనం మీదనుంచి పొయ్యిలోకి’’ నెట్టిందని బాబు త‌న లేఖ‌లో పేర్కొన్నారు. వారం రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపయ్యాయని…వైసీపీ నాయకుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఆరోపించారు. మొదట తేలిగ్గా మాట్లాడటం, తర్వాత చేతగానితనాన్ని బయటపెట్టడం పాలకుల లక్షణం కాదన్నారు.

అప్పుడు ‘‘కరోనా వస్తుంది, పోతుంది… పారాసిటమాల్, బ్లీచింగ్ చాలు’’ అని తేలిగ్గా వ్యాఖ్యలు చేశారని …ఇప్పుడు ‘‘కరోనాతో కలిసి జీవిద్దాం, మన జీవనంలో ఇది కూడా అంతర్భాగం, మామూలు జ్వరం లాంటి దే ఇది’’ అనే వ్యాఖ్యలు పాలకుల డొల్లతనాన్ని బయటపెట్టాయని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు రాసిన లేఖ‌లో కొత్త‌గా చెప్పిన విష‌యం అంటూ ఏమీలేదు. నిజానికి ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు వంటి సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు ఇలా ప్ర‌జ‌ల‌కు లేఖ‌లు రాయ‌డం, రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డంతో స‌రిపెట్ట‌డం ఏమేర‌కు స‌రైంద‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

గ‌తంలో లాక్‌డౌన్ విధించిన స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీని పొగుడుతూ.. ట్వీట్ల‌పై ట్వీట్లు చేసిన చంద్ర‌బాబు.. ఇప్పుడు అదే ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి ఎందుకు లేఖ‌లు రాయడం లేదు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో వ‌ల‌స కార్మికుల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని చెబుతున్న చంద్ర‌బాబు.. ఇదే విష‌యాన్ని మోడీ ద‌గ్గ‌ర కూడా ప్ర‌స్థావించి స‌ద‌రు స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం క‌నుగొనే ప్ర‌య‌త్నం చేయొచ్చుక‌దా? అనేది ప్ర‌శ్న‌.

అదే స‌మ‌యంలో రాష్ట్రానికి కోత పెట్టిను ప‌న్నుల విష‌యాన్ని కూడా ప్ర‌స్థావించి నిధులు వ‌చ్చేలా చేయొచ్చుక‌దా?  ఈ స‌మ‌యంలో త‌న స్థాయికి త‌గిన విధంగా స్పందించి, కీల‌కమైన వ్య‌వ‌స్థ‌ల‌ను క‌దిలించ‌డం మానేసి.. ఇలా ప్ర‌జ‌ల‌కు లేఖ‌లు రాయడం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఏంట‌నేది కేవ‌లం పొలిటిక‌ల్ స్టంటేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version