టీఆర్ఎస్ రాజకీయాల్లో సంచలన మార్పు చోటు చేసుకుంటోందా ? అంటే ఔననే అంటున్నారు పరిశీల కులు. త్వరలోనే ఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లలో ఈ పార్టీకి అసెంబ్లీలో ఉన్న బలం నేపథ్యంలో రెండు సీట్లు ఈ పార్టీకే చెందనున్నాయి. ఈ క్రమంలో ఆ సీట్లను ఎవరికి కేటాయిస్తారనే విషయం సంచలనంగా మారింది. ఇప్పటికిప్పుడు చాలా మంది పదవుల వేటలో ఉన్నారు. నాయిని నరసింహారెడ్డి నుంచి అనేక మంది సీనియర్లు పదువుల లేక కొట్టుమిట్టాడుతున్నారు. అదే సమయంలో ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేకేకు రెన్యువల్ చేయాల్సి ఉంది.
అయితే, ఇవిలా కథనాలుగా కనిపిస్తుండగానే కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ఒకటి పార్టీకి అన్ని విధాలా సేవ చేస్తున్న.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ, తన కుమార్తె కవిత గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి ఓడిపోయరు. అప్పటి నుంచి ఆమె రాజకీయంగా యాక్టివ్‌గా ఉండడం లేదు. పదవి లేకపోవడంతో ఆమె పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నట్టుగా ఉంటున్నారన్నది ఓపెన్ సీక్రెట్.
ఈ క్రమంలో ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. రాజకీయంగా దూకుడు స్వభావం ఉండడం, రెండు మూడు భషలపై పట్టుండడం, స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కేంద్రంలో రాష్ట్ర వాణిని వినిపించాల్సిన అవసరం ఉన్న క్రమంలో కవిత అయితేనే న్యాయం జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక సీటును కవితతో భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఇక, రెండో సీటును వాస్తవానికి ప్రస్తుతం కేసీఆర్‌కు రైట్‌హ్యాండ్‌గా ఉన్న కేకేకే ఇస్తారని అనుకున్నారు.
అయితే, ఆయన కన్నా ఇప్పుడు ఖమ్మానికి చెందిన మాజీ ఎంపీ పొంగులేటికి అవకాశం ఇచ్చే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే పెద్దల సభపై హమీ లభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ టికెట్ నిరాకరించినా. .పొంగులేటి పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పార్టీ అభ్యర్ధుల విజయం కోసం పనిచేశారు.
ఖమ్మం జిల్లాలో ఎంపీ సీటు కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటికి కాదని మరీ కేసీఆర్ నామా నాగేశ్వరరావుకు సీటు ఇచ్చారు. పొంగులేటి చేసిన త్యాగం నేపథ్యంలో పొంగులేటిని పెద్దల సభకు పంపాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మొత్తంగా చూస్తే.. టీఆర్ఎస్‌లో ఈ ఇద్దరు పెద్దల సభకు వెళ్లనున్నారన్నదే పెద్ద హాట్ టాపిక్…!