జ‌గ‌న్‌కు పొంచి ఉన్న బాబు అనుభవం…!

-

రాష్ట్రంలో తొలిసారి సీఎం ప‌గ్గాలు  చేప‌ట్టిన సీఎం జ‌గ‌న్‌. త‌న‌కు ఫార్టీ ఇయ‌ర్స్ అనుభ‌వం ఉంద‌ని, ఇప్ప టికే మూడు సార్లు సీఎంగా చ‌క్రంతిప్పాన‌నే చంద్ర‌బాబు. ఇలా ఒక‌రికి ఒక‌రు అన్ని విష‌యాల్లోనూ పోటీ ప‌డుతు న్నారు. అయితే, ప్ర‌స్తుతం సీఎంగా ఉన్న జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు అనుభ‌వంతో పెను ముప్పు పొం చి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ సీఎంగా అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసు కున్నారు. వీటిలో త‌న‌కు ఇబ్బంది లేని వాటిపై చంద్ర‌బాబు ఎలాంటి కామెంట్లు చేయ‌లేదు. కానీ, సుస్థి రంగా జ‌గ‌న్‌కు పేరు వ‌స్తుంద‌ని భావించిన వాటిని మాత్రం ఏకేశారు.


వీటిలో ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో ఇంగ్లీష్ మీడియం, పేద‌ల‌కు ఇళ్లు, రాజ‌ధాని త‌ర‌లింపు, ప్ర‌భుత్వ కార్యాల‌యా ల‌పై వైసీపీ రంగులు, వివేకానంద హ‌త్య కేసు వంటి విష‌యాల్లో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిం చారు. ఆయా విష‌యాల్లో ప‌రోక్షంగా ఆయ‌న స‌హ‌కారంతో కొంద‌రు కోర్టుల్లో కేసులు వేశారు. ప్ర‌స్తుతం కొ న్నింటిలో తీర్పులు రావ‌డం ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకించ‌డం తెలిసిందే. ఇది నిజంగా చంద్ర‌బాబు వ్యూహా న్ని స్ప‌ష్టంగా బ‌య‌ట‌పెడుతోంది. త‌న‌కు సంబంధం లేన‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించినా. వీటి వెనుక బాబు ప‌క్కా స్కెచ్ ఉంది.

ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌రిణామాలు ఇవి. ఇప్ప‌టికే చంద్ర‌బాబు జ‌గ‌న్‌ను చేత‌కానివాడ‌నే ప్ర‌చారం భారీ ఎత్తున చేస్తున్నారు. ఇక‌, ఇప్పుడు కోర్టు తీర్పులు కూడా జ‌గ‌న్ నిర్ణ‌యాల‌ను స‌మీక్షించుకునే ప‌రిస్థితిని క‌ల్పిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో రాబోయే రోజుల్లో జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే.. మ‌రింత‌గా ఇబ్బంది ఎదుర్కొనాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది కేవ‌లం ప‌ది మాసాల పాల‌నే. ఈ పాల‌న‌లోనే ఇన్ని రూపాల్లో కోర్టుల నుంచి వ్య‌తిరేక‌త‌లు కొని తెచ్చుకుంటే.. జ‌ర‌గ‌బోయే సంవ‌త్స‌రాల్లో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే.. చంద్ర‌బాబే ఈ రాష్ట్రానికి స‌రైన నాయ‌కుడ‌నే ప్ర‌చారం పెరుగుతుంద‌ని ఇది జ‌గ‌న్‌కు ముప్ప‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version