ఒక బాధ్యతగల పదవిలో ఉన్న డిఎస్పి తన కొడుకుకి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నాగాని నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇరవై ఎనిమిది మంది జీవితాలను డేంజర్ లోకి నెట్టేసిన ఘటన ఖమ్మం..కొత్తగూడెం లో చోటుచేసుకుంది. ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు సూచనలు జారీ చేసిన గాని వాటిని పట్టించుకోకుండా పెడచెవిని పెట్టి డిఎస్పి తన కుమారుడిని ఫంక్షన్ కి తీసుకు రావడం జరిగింది. దీంతో ఆ వ్యక్తి 28 మందిని కలవటంతో వాళ్ల ప్రాణాలకు అపాయం కలిగింది.
ఇదిలా ఉంటే లండన్ నుంచి వచ్చిన తన కొడుకుని క్వారంటైన్ చేయకుండా బయటకు పంపినందుకు డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. డిఎస్పి కుటుంబ సభ్యులందరినీ ప్రభుత్వం క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వాళ్ళందరి రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ పరిణామంతో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో 24 అవర్స్ కర్ఫ్యూ విధించాలని తెలంగాణ సర్కార్ అనుకుంటున్నట్లు సమాచారం.