సీనియర్ పొలిటీషియన్, ప్రకాశం జిల్లాకు చెందిన నాయకుడు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి కుమారుడు, యువ నేత కరణం వెంకటేష్‌లో మంచి జోష్ కనిపిస్తోందని అంటున్నారు నియోకవర్గం ప్రజలు. గత ఏడాది ఎన్నికల్లో బలరాం.. చీరాల నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. వాస్తవానికి తన కుమారుడు వెంకటేష్‌కు అద్దంకి టికెట్ ఇప్పించుకోవాలని బలరాం భావించారు. అయితే, ఈ విషయంలో చంద్రబాబు అడ్డుతగలడంతో చివర్లో అనూహ్య పరిణామాల మధ్య తానే స్వయంగా చీరాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే, అనంతరం ఇటీవల కాలంలో తండ్రి టీడీపీలోనే ఉండిపోయి… పరోక్షంగా వైసీపీకి మద్దతుదారుగా మారారు. వెంకటేష్‌కు మాత్రం వైసీపీ కండువా కప్పించారు.
ప్రస్తుతం ఇప్పటికే పది లక్షలకు పైగా ఆహార పొట్లాలను నిత్యం పేదలకు, వలస కార్మికులకు వెంకటేష్ ఆధ్వర్యంలో అందిస్తున్నారు. అదేసమయంలో ఎవరైనా ఫోన్ చేసి తమ సమస్యను చెబితేచాలు.. అటు అద్దంకి, ఇటు చీరాలలోనూ వాలిపోతున్నారట. సదరు సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా అక్కడే ఉండి పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడు తనకు రాజకీయంగా మంచి స్వేచ్ఛ లభించిందని స్థానిక మీడియాతో వెంకటే ష్ తాజాగా తన అభిప్రాయం వెల్లడించారు. దీనిని బట్టి వచ్చే ఎన్నికల నాటికి.. ఆయన పుంజుకోవడం ఖాయమనిఅంటున్నారు. ఈ సమయంలో టీడీపీ మంచి యువ నేతను పోగొట్టుకుందనే విమర్శలు కూడా వస్తున్నాయి.