రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికే భారతీయ విద్యార్థులంతా.. అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లు, బంకర్లలో తలదాచుకుంటున్నారు.
ఇప్పటికే మొదటి బ్యాచ్ విద్యార్జులు ఉక్రెయిన్ నుంచి సరిహద్దులకు బయలుదేరారు. మొదటి బ్యాచ్ భారతీయ విద్యార్థులు చెర్నివ్ట్సీ నుండి ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దుకు బయలుదేరారు. ఉక్రెయిన్ డేన్లో హాలిత్స్కీ మెడికల్ యూనివర్శిటీ, ఎల్వివ్లోని దాదాపు 40 మంది భారతీయ వైద్య విద్యార్థుల బృందం ఉక్రెయిన్-పోలాండ్ సరిహద్దు వైపు వెళ్తున్నారు. వారిని కాలేజీ బస్సులో బోర్డర్ పాయింట్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో దించారు.
మరోవైపు ఈరోజు రొమేనియాలోని బుకారెస్ట్‌కు రెండు విమానాలు, రేపు హంగేరిలోని బుడాపెస్ట్‌కు ఒక విమానాన్ని ఇండియన్ గవర్నమెంట్ విమానాలను నడపాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.