Bheemla nayak : ”ప‌వ‌ర్ తుఫాన్” .. భీమ్లా నాయ‌క్‌పై చిరు ట్వీట్

-

ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా 3000 వేలకు పైగా థీయేట‌ర్స్ ల‌లో ప‌వ‌న్ క‌ళ్యాన్, రానా క‌లిసి న‌టించిన భీమ్లా నాయ‌క్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్ లో కూడా దుమ్ము లేపుతుంది. భీమ్లా నాయ‌క్ సినిమాపై సినీ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా స్పందిస్తున్నారు. ఇలాంటి సినిమా చూడలేద‌ని కామెంట్ చేస్తున్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశ్వ రూపం చూశామ‌ని అభిమానులు సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు.

టాలీవుడ్ రికార్డులు మొత్తం కూడా బ్రెక్ అవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. కాగ తాజా గా భీమ్లా నాయ‌క్ సినిమాపై మెగా స్టార్ చిరంజీవి స్పందించారు. త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా భీమ్లా నాయ‌క్ చిత్ర యూనిట్ కు విష్ చేశారు. ప‌వ‌ర్ తుఫాన్ అంటూ కామెంట్ చేశారు. అంతే కాకుండా.. భీమ్లా నాయ‌క్ సినిమాలో సెట్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా తో దిగిన ఒక ఫోటోను కూడా ఫోస్టు చేశారు. కాగ ప్ర‌స్తుతం.. ఈ ట్వీట్ కూడా సోషల మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version