11 నిమిషాలే రేప్ చేశాడని నిందితుడికి ఓ మహిళా జడ్డి శిక్షను తగ్గించింది. బెర్లిన్ లోని స్పెయిల్ కోర్టు మహిళా జడ్జి ఓ రేప్ కేసులో శిక్షను తగ్గిస్తూ ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు చర్చగా మారింది. గతేడాది ఫిబ్రవరి నెలలో 17 ఏళ్ల యువతిపై నైట్ క్లబ్ లో ఓ దుర్మార్గుడు 33 ఏళ్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో అతడిని అరెస్ట్ చేయగా…. నాలుగేళ్ల మూడు నెలల జైలు శిక్ష పడింది. అయితే అతడు శిక్షను తగ్గించాలంటూ కోర్టులో అప్పీల్ చేసుకోగా నిందితుడు 11 నిమిషాల పాటు రేప్ చేసాడాని మూడేళ్లకు శిక్షను తగ్గిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది.
మహిళ ఒంటిపై గాయాలను బట్టి తీర్పు ఇస్తున్నామని మహిళా జడ్జి ప్రకటించింది. దాంతో మహిళా సంఘాలు మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు వద్దకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మహిళా జడ్జి తీర్పును ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. అత్యాచారం అంటే అత్యాచారం అని దానికి సమయంతో పనేంటని… ఎన్ని నిమిషాలు అని పరిగణించకూడదు అని డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగలంటే నింధుతుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ మహిళ అయ్యుండి జడ్జి ఇలాంటి తీర్పు ఇవ్వడంతో ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.