కరోనా కారణంగా గత ఏడాదిన్నర కాలంగా స్కూల్ లు కాలేజీలు మూత పడిపోయాయి. దాంతో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే ఆన్లైన్ క్లాస్ లతో విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాంతో విద్యాసంస్థలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఏపీలో 16 నుండి స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఇంటర్ అడ్మిషన్స్ కోసం కూడా బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 13 నుండి 23 వరకు ఆన్లైన్ ద్వారా అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు ఇంటర్ అడ్మిషన్ల కోసం అప్లై చేసుకోవచ్చు. bie.ap.gov.in అనే వెబ్సైట్ లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ చేసే సమయంలో ఎలాంటి సర్టిఫికెట్ లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని దరఖాస్తు ఫీజు ఓసి మరియు బీసీలకు రూ.100 కాగా ఎస్సీ ఎస్టీ, ఎస్సి లకు రూ. 50 గా నిర్ణయించారు. ఈ నెలాఖరులోపు దరఖాస్తులను పరిశీలించి అడ్మిషన్స్ ఇవ్వనున్నారు. కరోనా కారణంగా నిబంధనల మధ్య స్కూల్స్ మరియు కాలేజీలలో కరోనా నిభందనలు పాటించే అవకాశం ఉందని తెలుస్తోంది.