Breaking: నదిలోకి దూసుకెళ్లిన రెండు బస్సులు.. 63మంది మిస్సింగ్

-

నేపాల్లో మరోసారి కొండచరియలు విరిగి పడిన ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనతో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు గాడి తప్పాయి. హైవేపై కొండచరియలు విరిగిపడడం వల్ల త్రిశూలి నదిలోకి రెండు బస్సులు దూసుకెళ్లాయి. ఈ బస్సుల్లో దాదాపు 60కిపైగా మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సెంట్రల్ నేపాల్‌లోని మదన్ – ఆష్రిత్ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

సమాచారం అందుకున్న స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో బస్సుల కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు బస్సుల ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు తెలిపారు. ఈ రెండు బస్సుల్లో కలిపి 63 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు వెల్లడించారు. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో ప్రమాదాన్ని తప్పించే క్రమంలో బస్సులు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. బస్సుల కోసం గాలింపు తీవ్రం చేశామని, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version