ఏపీలో కొత్తగా మరో ఐదు ఎయిర్ పోర్టులు!

-

ఏపీలో మరో ఐదు కొత్త ఎయిర్ పోర్టులు రాబోతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని భోగాపురం ఎయిర్‌పోర్టుకు సమాంతరంగా మరో 5 నుంచి 6 ఎయిర్‌పోర్టులు వస్తాయని సీఎం తెలిపారు. భోగాపురం విమానాశ్రయంతోపాటు దొనకొండ, దగదర్తి, కుప్పం, నాగార్జునసాగర్‌ వద్ద విమానాశ్రయాలు నిర్మిస్తామని వెల్లడించారు. అదే విధంగా కాకినాడ – అమలాపురం మధ్య మరో ఎయిర్పోర్టు రానున్నట్లు పేర్కొన్నారు.

ఒక్కో విమానాశ్రయం నిర్మాణానికి 800 నుంచి వెయ్యి ఎకరాల వరకు అవసరమవుతుందని అధికారులు చెప్పారని చంద్రబాబు తెలిపారు. జాతీయ రహదారుల తరహాలో పీపీపీ మోడళ్లలో ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వయోబిల్టి గ్యాప్‌ ఫండింగ్‌ ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు 2026 జూన్ నాటికి భోగాపురం పూర్తవుతుందని నిర్మాణ సంస్థల ప్రతినిధులు అంటున్నారని, తాను ఇంకా ముందే పూర్తి చేయమంటున్నానని సీఎం తెలిపారు. 2026 జూన్ 30న వచ్చి దీనిని ఆపరేషన్ చేయాలని, అందుకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version