ఎలాన్ మస్క్‌కు షాక్ తగిలింది. నిన్నటిదాకా ప్రపంచ కుబేరుడిగా అతడి స్థానాన్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ దక్కించుకున్నారు. 200 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా జెఫ్ బెజోస్ అవతరించారు. ఇప్పటి వరకు నంబర్ 1 స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ తన సంపదలో 31 బిలియన్ డాలర్లు కోల్పోవడంతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
బ్లూబెర్గ్ బిలయనీర్స్ ఇండెక్స్ ప్రకారం, 2024లో జెఫ్ బెజోస్ 23 బిలియన్ డాలర్లు మేర లాభాలను ఆర్జించగా ఆయన సంపద 200 బిలియన్ డాలర్లకు పెరిగింది. మరోవైపు ఎలాన్ మస్క్ ఈ 2024లో 31 బిలియన్ డాలర్లు కోల్పోవడంతో అతని సంపద 198 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఫలితంగా ఆయన ప్రపంచ ధనవంతుల లిస్ట్లో రెండో స్థానానికి దిగివచ్చారు. బిలియనీర్ల తలరాతలను మార్చే యూఎస్ స్టాక్ మార్కెట్లలో 2024లో అమెజాన్ షేర్లు దాదాపు 18 శాతం మేర లాభపడ్డాయి. మరోవైపు టెస్లా కంపెనీ షేర్లు 24 శాతం వరకు నష్టపోయాయి.