టిక్ టాక్, వి చాట్ లపై నిషేధం ఎత్తివేత.. అమెరికా.

-

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో మార్పులు జో బైడెన్ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు చైనా యాప్స్ అయిన టిక్ టాక్, వి చాట్ లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ రెండు యాప్స్ పై నిషేధం ఎత్తివేసారు. ఈ మేరకు బైడెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుండి టిక్ టాక్, వి చాట్ అప్లికేషన్లు అమెరికాలో అందుబాటులో ఉండనున్నాయి. అదే కాదు సమాచారం విషయంలో కఠిన నియమాలను పాటించాలంటూ సమాచార రక్షణ సంబంధ విషయంలో ఎక్సిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు.

టిక్ టాక్, వి చాట్ సహా 8ఇతర సాఫ్ట్ వేర్ కమ్యూనికేషన్స్ విషయంలో కొత్త ఎక్సిక్యూటివ్ ఆర్డర్లను ఇచ్చారు. ఇందులో రెండు మాత్రం లిటిగేషన్ తో కూడుకుని ఉంటాయి. భారతదేశంలోనూ టిక్ టాక్, వి చాట్ లపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. భారత ప్రజల వ్యక్తిగత సమాచారానికి భంగం కలిగి దేశ రక్షణలో ఇబ్బందులు ఏర్పడుతాయన్న ఉద్దేశ్యంతో భారతదేశం చైనా యాప్స్ పై నిషేధం విధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version