చీకట్లోకి అమెరికా సమాజం… పొంచి ఉన్న భారీ ముప్పు

-

కరోనా మహమ్మారిపై అమెరికా ఇప్పుడు మరింత బలంగా యుద్ధం చెయ్యాల్సిన అవసరం వచ్చిందని… అమెరికా ప్రభుత్వ అత్యున్నత శాస్త్రవేత్త ఆంథోనీ ఫౌసీ ఆదివారం హెచ్చరించారు. కరోనా దేశంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉందని ఆయన అన్నారు. రాబోయే కొన్ని వారాల్లో పరిస్థితి చాలా దారుణంగా దిగజారిపోతుందని అన్నారు. దేశంలో “చీకటి రోజులు మన ముందు ఉన్నాయి అని అన్నారు.

టీకాలు వేయడానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్న ఫౌసీ… మొదటి షాట్ అందుకున్న తర్వాత తాను బాగానే ఉన్నానని, అసలు ఏ ఇబ్బందులు లేవు అని చెప్పారు. గత వారం వరుసగా ఆరు రోజులు విమాన ప్రయాణాలు బాగా పెరిగాయి. గత నెల థాంక్స్ గివింగ్ హాలిడే తర్వాత యుఎస్ లో కరోనా వైరస్ కేసులు డిసెంబరులో బాగా పెరిగాయి. 2,00,000 కొత్త కేసులు మరియు కొన్ని సార్లు రోజుకు 3,000 మందికి పైగా మరణించారు.

ఆస్పత్రులు అన్నీ కూడా ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. కొత్త వ్యాక్సిన్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా కదులుతున్నాయి. మొదట ఫ్రంట్-లైన్ ఆరోగ్య కార్యకర్తలకు మరియు దీర్ఘకాలికంగా ఆస్పత్రుల్లో పని చేస్తున్న వారికి వ్యాక్సిన్ లు అందిస్తున్నారు. కరోనా అనేది అమెరికా సమాజాన్ని ఇప్పట్లో వీడే అవకాశం లేదని, కరోనాను అంతం చేసే సామర్ధ్యం ఇప్పట్లో అమెరికా వద్దకు వచ్చే అవకాశం లేదని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version