నేడు నాలుగు రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్‌ డ్రై రన్.. ఏపీలో కూడా !

-

ఈరోజు ఆంద్రప్రదేశ్ సహా నలుగు రాష్ట్రాల్లో డమ్మీ వ్యాక్సినేషన్ (డ్రై రన్‌) నిర్వహిస్తున్నారు. ఈ డ్రై రన్ కోసం గుజరాత్, పంజాబ్, అసోం, ఆంధ్ర ప్రదేశ్‌ లను కేంద్రం ఎంపిక చేసింది. ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాలను సెలక్ట్ చేశారు.. మొత్తంగా ఎనిమది జిల్లాల్లో ఈరోజు, రేపు అంటే రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఏపీలోని రెండు జిల్లాలలో కరోన వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహిస్తున్నారు. అందులో ఒకటిగా కృష్ణా జిల్లాను డ్రై రన్ కు ఎంపిక చేసింది ప్రభుత్వం. జిల్లాలో డ్రై రన్ కోసం ఐదు  సెంటర్లు ఏర్పాటు చేశారు.

విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్తి, ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పూర్ణా హార్ట్ ఇన్సిట్యూట్ (ప్రైవేట్ వైద్య కేంద్రం), సూర్యారావు పేట, కృష్ణవేణి డిగ్రీ కళాశాల, తాడిగడప, సచివాలయం -4 పెనమలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రకాశ్ నగర్ యు.పి హెచ్.సి, ప్రకాశ్ నగర్, నున్న  విజయవాడలను అందుకోసం ఎంపిక చేశారు. ఇక ప్రతి వ్యాక్సిన్ సెంటర్ లో ఒక మహిళ పోలీస్, డిజిటల్ అసిస్టెంట్, A.N.M,  అంగన్వాడి వర్కర్, ఆశా వర్కర్ ను నియమించారు. ఆరోగ్య కార్యకర్తలు, వ్యాక్సినేషన్ లబ్దిదారుల జాబితాలను రూపొందించి Co-WIN యాప్లో అప్ లోడ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సినేషన్ అనంతర ప్రతికూల పరిస్థితులు (AEFI) ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు కూడా చేశారు. డ్రైరన్ ప్రక్రియను వీడియో చిత్రీకరించి, కార్యాచరణ నివేదికను జిల్లా, రాష్ట్ర, స్థాయి టాస్స్ ఫోర్స్ లకు అంద చేయనున్నారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version