అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన కొంప తానే ముంచుకున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. సాధారణంగా దూకుడుగా ఉండే ట్రంప్ అమెరికాలో జరుగుతున్న ఆందోళనల విషయంలో కాస్త దూకుడు పెంచి వార్నింగ్ ఇచ్చారు. అమెరికా వ్యాప్తంగా జాతీయ భద్రతా దళాలను ఆయన మొహరించారు. దాదాపు 15 రాష్ట్రాల్లో జాతీయ భద్రతా దళాలు దిగి ఆందోళనలు కట్టడి చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే కాస్త హింస కూడా చెలరేగింది. దీనిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతుంది. ట్రంప్ అమెరికాను పదేళ్ళు వెనక్కు తీసుకుని వెళ్ళారు అని, ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు అమెరికాను ఒక దోషిగా చూస్తుందని, అమెరికాను రోడ్డు మీదకు లాగారు అని, ఇప్పుడు జార్జ్ ఫ్లాయిడ్ కి కాదు ఊపిరి అందనిది… ట్రంప్ కి ఓటు వేసిన అందరికి కూడా అందడం లేదని,
ట్రంప్ వెంటనే అధ్యక్ష పదవికి రాజీనామా చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగితే అమెరికా ఇంకా నాశనం అవుతుందని కాబట్టి ఆయన స్వచ్చందంగా రాజీనామా చేసి విధుల నుంచి తప్పుకోవడం చాలా మంచిది అని అమెరికన్లు అంటున్నారు. ట్రంప్ ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటే మంచిది అని అక్కడి ప్రజలు సూచిస్తున్నారు. ఇక అధికారులలో కూడా అసహనం తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతుంది.