కెనడా-భారత్​ల మధ్య ఉద్రిక్తల వేళ.. ఆ దేశంలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడి హత్య

-

ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య ఇప్పటికే ఉద్రిక్తలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్య కేసులో భారత్‌, కెనడా మధ్య వివాదం రాజుకున్న వేళ మరో ఘటన చోటుచేసుకుంది. కెనడాలో మరో ఖలిస్థానీ సానుభూతిపరుడు హత్యకు గురైనట్లు తెలుస్తోంది. విన్నిపెగ్‌లో బుధవారం ప్రత్యర్థి గ్యాంగ్ జరిపిన దాడిలో గ్యాంగ్‌స్టర్‌ సుఖ్‌దోల్‌ సింగ్‌ అలియాస్‌ సుఖా దునెకే మరణించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం. దీనిపై అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు.

పంజాబ్‌ లోని మోఘా జిల్లాలో దేవిందర్‌ బంబిహా గ్యాంగ్‌కు చెందిన సుఖా దునెకేపై భారత్‌లో పలు క్రిమినల్‌ కేసులున్నాయి. 2017లో అతడు నకిలీ ధ్రవ పత్రాలతో కెనడాకు పారిపోయాడని.. అక్కడకు వెళ్లిన తర్వాత కెనడా కేంద్రంగా పనిచేస్తున్న గ్యాంగ్‌స్టర్‌ అర్షదీప్‌ సింగ్‌ ముఠాలో చేరినట్లు నిఘా వర్గాల సమాచారం. ఖలిస్థానీ ఉద్యమంలో సుఖా కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.

పంజాబ్‌కు చెందిన దాదాపు 30 గ్యాంగ్‌స్టర్లు ప్రస్తుతం భారత్‌లో కేసుల నుంచి తప్పించుకునేందుకు వివిధ దేశాలకు పారిపోయినట్లు నిఘా వర్గాల సమాచారం. వీరిలో 8 మంది కెనడాలో ఉన్నట్లు సమాచారం. అందులో ఒకడైన సుఖా తాజాగా కాల్పుల్లో మరణించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version