రోజుకో ఫీచర్‌తో వాట్సాప్ సంస్థ యూజర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఛానల్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మాదిరి వాట్సాప్‌లోనూ ఛానెల్ క్రియేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఇండియాతో పాటు పలు దేశాల్లో ఈ ఫీచర్‌ను ప్రారంభించింది. ఇండియాలో అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్‌ను సెలబ్రిటీలతో పాటు ప్రభుత్వాలు కూడా వినియోగిస్తున్నాయి. ఇటీవలే ప్రధాని మోదీ వాట్సాప్‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్తపార్లమెంటులో దిగిన ఫొటోను పోస్టు చేసిన మోదీ.. ఇక నుంచి ప్రజలకు మరింత చేరువలో ఉండేందుకు వాట్సాప్ ఛానెల్లో అందుబాటులోకి వస్తానని క్యాప్షన్ రాసుకొచ్చారు.
ఇక తాజాగా తెలంగాణ సర్కార్ కూడా సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిసమాచారం.. పథకాలు.. ఇతర సేవల గురించి ప్రతి ఒక్కరికి వాట్సాప్ ద్వారా సమాచారం అందించేందుకు తెలంగాణ సీఎంవో పేరిట వాట్సాప్ ఛానెల్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రభుత్వం, సీఎంవో నుంచి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తామని వెల్లడించింది. ‘తెలంగాణ సీఎంఓ’ వాట్సప్ ఛానల్న్ సీఎంపీఆర్వో సమన్వయంతో ఐటీ శాఖకు చెందిన డిజిటల్ మీడియా విభాగం నిర్వహిస్తుందని తెలిపింది. వాట్సాప్‌ను అప్‌డేట్ చేసిన అనంతరం ఛానల్స్ సెర్చింగ్‌లో ‘తెలంగాణ సీఎంవో’ అని ఆంగ్లంలో టైప్ చేసి ప్లస్(+) గుర్తును క్లిక్ చేయడం ద్వారా ఈ ఛానల్‌ను అనుసరించవచ్చు.