సీప్యాప్‌ యంత్రం సాయంతో బైడెన్‌ నిద్ర.. వైట్‌హౌస్‌ వెల్లడి

-

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నారు. నిద్రకు సంబంధించిన తీవ్రమైన స్లీప్‌ ఆప్నియా అనే వ్యాధితో బాధపడుతున్నారు. గత కొన్ని వారాలుగా ఆయన సీప్యాప్‌ (కంటిన్యూస్‌ పాజిటివ్‌ ఎయిర్‌వే ప్రెజర్‌) యంత్రాన్ని వాడుతున్నారని వైట్​హౌస్ బుధవారం తెలిపింది. ఆయన వైట్‌హౌస్‌ నుంచి బయటకు వచ్చిన సమయంలో ముఖంపై గీతలు ఉండటంతో ఈ విషయాన్ని వెల్లడించాల్సి వచ్చిందని పేర్కొంది. అధ్యక్షుడు దాదాపు 2008 నుంచి స్లీప్‌ ఆప్నియా అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారని వెల్లడించింది.

వాస్తవానికి స్లీప్‌ ఆప్నియా అనేది చాలా మందిలో కనిపించే ఓ తీవ్రమైన సమస్య. నిద్రలో ఉన్న సమయంలో గాలిపీల్చుకోవడం తరచూ ఆగిపోతూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు రాత్రి మొత్తం నిద్రపోయినా.. ఉదయం పూట అలసిపోయినట్లు ఉంటారు. అమెరికాలో 3 కోట్ల మందిలో ఇటువంటి సమస్య ఉండొచ్చని అంచనా. దీంతో పాటు గురక సమస్య కూడా ఉంటుంది. సీప్యాప్‌ యంత్రాన్ని బైడెన్‌ మంగళవారం రాత్రి కూడా వాడాల్సి వచ్చిందని శ్వేతసౌధం అధికారులు వెల్లడించారు. బైడెన్‌ షికాగోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయన ముఖంపై గీతలు కనిపించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version