ఆ ఒక్క వ్యాక్సిన్‌తో క‌రోనా జాతి వైర‌స్‌లు అంత‌మే..!

-

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్‌ను అంతం చేయ‌డానికి అనేక ప్ర‌యత్నాలు, ప్ర‌యోగాలు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో కేంబ్రిడ్జి యూనివ‌ర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా వైర‌స్‌తోపాటు ఆ జాతికి చెందిన అన్ని రకాల వైరస్‌లను త‌రిమికొట్టేందుకు టీకాను తయారు చేయటానికి కృషి చేస్తున్నామని కేంబ్రిడ్జి యూనివర్సిటీ తెలిపింది. కరోనా జాతికి చెందిన అన్ని రకాల వైరస్‌ల జన్యుక్రమాలను ఉపయోగించి డీఐవోఎస్‌-కోవాక్స్‌2 అనే వ్యాక్సిన్‌ను ఇప్పటికే అభివృద్ధి చేశామని, దానిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉన్నదని వెల్లడించింది. ట్రయల్స్‌ విజయవంతమైన తర్వాత.. రోగులకు నొప్పి కలుగకుండా ‘స్ప్రింగ్‌ పవర్డ్‌ జెట్‌ ఇంజిక్షన్‌స విధానం అంటే.. సూది వాడ‌కుండా టీకాను శరీరంలోకి ఎక్కించడం ద్వారా ఈ టీకాను వేస్తామని తెలిపింది.

*కొవిడ్‌-19 వైరస్‌ నిర్మాణాన్ని 3డీ కంప్యూటర్‌ మోడలింగ్‌ ద్వారా విశ్లేషించి టీకాను అభివృద్ధి చేశాం. భవిష్యత్‌లో జంతువుల నుంచి మానవులకు సోకే అవకాశమున్న సార్స్‌, మెర్స్‌ వంటి కరోనా జాతి వైరస్‌ రకాలను కూడా కట్టడి చేసేలా ఈ టీకాను అభివృద్ధి చేశాం. దీని కోసం ఆయా వైరస్‌ జన్యు క్రమాలను కూడా విశ్లేషించాం* అని ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న‌ ప్రొఫెసర్‌ జోనథాన్‌ హీనే తెలిపారు. అత్యంత తక్కువ ధరలోనే టీకాను అందుబాటులోకి తెస్తామని మరో శాస్త్రవేత్త డాక్టర్‌ రెబెకా కిన్స్‌లే తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version