ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్​క్రీమ్.. ధర ఎంతో తెలుసా..?

-

జపాన్‌కు చెందిన ప్రముఖ ఐస్‌ క్రీమ్‌ బ్రాండ్‌ సెలాటో ఓ స్పెషల్ ఐస్ క్రీమ్​ను తయారు చేసింది. అయితే ఈ ఐస్​ క్రీమ్ ధర చూస్తే మాత్రం మీకు కచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్ ప్రంపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్. అత్యంత అరుదుగా దొరికే పదార్థాలతో కలిపి చేసిన ఈ ఐస్‌క్రీమ్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు సాధించింది. ఈ ఐస్‌క్రీమ్‌ను 8,73,400 జపనీస్‌ యెన్‌ (భారత కరెన్సీలో దాదాపు రూ.5.2లక్షలు)ల చొప్పున విక్రయిస్తోంది.

దీని తయారీలో ఉపయోగించిన వైట్‌ ట్రఫుల్‌ అనే అరుదైన పదార్థాన్ని ఇటలీలోని ఆల్బా నుంచి తెప్పించింది. ఈ ట్రఫుల్‌ ధర కిలోకు 2 మిలియన్‌ జపనీస్‌ యెన్‌లు ఉంటుందట. ఆల్బాలో మాత్రమే దొరికే దీని సువాసన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీనివల్లే ఈ ఐస్‌క్రీమ్‌ ధర ఇంతగా ఉందట. దీంతో పాటు పర్మిజియానో రెగ్గియానో అనే చీజ్‌, సేక్‌ లీస్‌ అనే వైట్‌ సాస్‌ వంటి పదార్థాలు కూడా ఇందులో వాడారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా ఇది గిన్నిస్‌ రికార్డు సాధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version