అంతరిక్షంలో చైనా కీలక అడుగు.. మరో భారీ టెలిస్కోప్‌ నిర్మించిన డ్రాగన్ దేశం

-

అంతరిక్షంలో ఇప్పటికే పలు విజయవంతమైన ప్రయోగాలు చేసిన చైనా.. ఖగోళాన్ని శోధించడంలో మరో కీలక అడుగు వేసింది. తాజాగా ఈ డ్రాగన్ దేశం.. ఉత్తరార్ధ గోళంలోనే పెద్దదైన అత్యంత శక్తిమంతమైన టెలిస్కోప్‌ను అభివృద్ధి చేస్తోంది. అన్నీ సజావుగా సాగితే ఈ నెల రెండో వారంలో ఇది అందుబాటులోకి రానుందట. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా జిన్హువా వెల్లడించింది. దీని ద్వారా ఖగోళంలో అప్పటికప్పుడు జరుగుతున్న ఘటనలను పరిశీలించి, పరిశోధనలు చేయడం సాధ్యపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దాదాపు 2.5 మీటర్ల వ్యాసంతో ఈ వైడ్‌ ఫీల్డ్‌ సర్వే టెలిస్కోప్‌ WFSTని రూపొందించినట్లు తెలిపారు.

చైనా.. ఇప్పటికే సుదూర అంతరిక్షం నుంచి రేడియో సిగ్నల్స్‌ను స్వీకరించగల ప్రపంచంలో అతిపెద్ద రేడియో టెలిస్కోప్‌ను గుయిజౌ ప్రావిన్సులో డ్రాగన్‌ నిర్మించిన విషయం తెలిసిందే. చైనా శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయంతో పాటు చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ అధీనంలోని పర్పుల్‌ మౌంటైన్‌ అబ్జర్వేటరీ ఇప్పుడు వైడ్‌ ఫీల్డ్‌ సర్వే టెలిస్కోప్‌ WFSTను రూపొందించాయి.

Read more RELATED
Recommended to you

Latest news