భారత్ చైనా ల మధ్య ఉన్న ఆప్యాయత అనుబంధం గాల్వాన్ ఘర్షణ అనంతరం భూస్థాపితం అయ్యాయి. భారత్ లో బ్యాన్ చైనా నినాదం మారుమ్రోగింది. 59 చైనా యాప్స్ ను సుప్రీం నిషేధించింది. చైనా మార్కెట్ దద్దరిల్లింది చైనాకు కోట్ల నష్టం వాటిల్లింది. ఇక నాది శాంతి మంత్రం అని చెప్పుకుంటున్న ప్రధాని మోడి కూడా సంయమనాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ప్రధాని రాష్ట్రపతులు చైనా అంశం పై చర్చించారు, ప్రధాని లడఖ్ వెళ్ళి సైనికులకు మరింత బలాన్ని చేకూర్చారు. మిత్రదేశం అమెరికా యుద్ధ నౌకలను పంపింది. ఇంత జరిగాకా కానీ చైనా కు బుద్ధి రాలేదు. ప్రపంచం లోని అహంకారా దేశంగా ముద్ర వేయించుకునేంత వరకు చైనా అదుపులోకి రాలేదు. భారత్ తో పాటు అనేక దేశాల్లో చైనా అంతే ఛీ నా అనే పేరు సంపాదించుకునేంత వరకు చైనా వెనుదిరగలేదు.
ఇక ఇవన్నీ జరిగాకే చైనా కు బుద్ధి వచ్చింది. నేడు వాస్తవాధీన రేఖ వెంబడి తిష్టవేసిన చైనా బలగాలు ఎట్టకేలకు వెనుదిరిగాయి. గాల్వన్ లోయ వద్ద ఏర్పాటు చేసుకున్న టెంట్లను తొలగించి ఒక కిలోమీటరు దూరం వెనక్కి వెళ్లాయి. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని చైనా మీడియా ప్రశ్నించగా నీతిమంతుడిలా చైనా విదేశాంగ మంత్రి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ… చైనా సైన్యంలోని ముందు వరుస దళాలు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు అనుగుణంగా కీలక చర్యలు తీసుకుంటున్నాయని, ఘర్షణలను నివారించే క్రమంలో సంయమనం పాటించడంలో మరింత పురోగతి సాధించాయని వెల్లడించారు. గాల్వన్ లోయ నుంచి చైనా బలగాలు వెనుదిరిగినట్టు వార్తలు వస్తున్నాయి కదా అని మీడియా అడిగినప్పుడు లిజియాన్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఇంత జరిగాకా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కంటే ముందే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉండాల్సింది అని అంటున్నారు విశ్లేషకులు.