భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తల నడుమ కీలక పరిణామం చోటు చేసుకుంది. శుక్రవారం షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశం సందర్భంగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో సమావేశం కావాలని చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెంగ్ రిక్వస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. ఎస్సీఓ రక్షణ మంత్రిత్వ సమావేశానికి గానూ రక్షణ మంత్రులు ఇద్దరూ మాస్కోలో ఉన్నారు. నిన్న రాజనాథ్ అక్కడికి చేరుకున్నారు.
భారతదేశం, పాకిస్తాన్, చైనా, కజాఖ్స్తాన్, కిర్గిజ్స్తాన్, రష్యా, తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ ఈ కూటమిలో భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి. ఈ ఏడాది ఆరంభంలో విజయ దినోత్సవ వేడుకల కోసం మాస్కోలో ఉన్నప్పుడు రాజ్‌నాథ్ సింగ్ తో సమావేశం కావాలని భారత్ కు చైనా నుంచి అభ్యర్థన వచ్చింది. అయితే అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా ఆ సమావేశం జరగలేదు.