భారత్, చైనా.. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేంత ఉద్రిక్తతలున్నాయి. అయినా చైనీయులకు భారత ప్రధాని మోదీ అంటే బాగా ఇష్టమట. మోదీకి చైనా ప్రజల్లో భారీగా ఆదరణ ఉందని.. ఆయనను చైనీయులు అసాధారణ పురుషుడిగా పరిగణిస్తున్నారని అమెరికా పత్రిక ‘డిప్లొమాట్’ వెల్లడించింది. ఈ మేరకు ఒక కథనాన్ని అది ప్రచురించింది.
‘చైనీయులు సామాజిక మాధ్యమాల్లో ‘మోదీ లాక్షియన్’ అని మోదీకి పేరు పెట్టుకున్నారు. దాని అర్థం అసాధారణ సామర్థ్యమున్న వృద్ధుడైన దివ్య పురుషుడు. ఆయన మిగిలిన నేతలకన్నా విభిన్నంగా ఉంటారు’ అని ఆయన విశ్లేషించారు. ఆయన వస్త్రధారణ, రూపం అసాధారణంగా ఉంటాయని, ఆయన విధానాలూ గత నేతలకన్నా భిన్నంగా ఉంటాయని తెలిపారు. రష్యా, అమెరికా, దక్షిణ దేశాలతో మోదీ స్నేహంగా ఉంటారనేది చైనీయుల అభిప్రాయమని షుంషాన్ వివరించారు.
చైనాలో ట్విటర్‌కు పోటీగా వచ్చిన ‘సైనా వీబో’లో మోదీ 2015లో చేరారు. ఆయనకు 2.44 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే చైనా యాప్‌లపై నిషేధంలో భాగంగా 2020 జులై తర్వాత ఆయన తన ఖాతాను మూసేశారు.