డయాబెటిస్ మరియు గుండె జబ్బులు ఉన్నవారికి కరోనా అత్యంత ప్రమాదకరం అని పరిశోధకులు వెల్లడించారు. వారికి సాధారణంగా కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన కరోనా వైరస్ లక్షణాలు వారిలో పెరిగే అవకాశం ఉంటుంది అని వెల్లడించారు. ఒక ల్యాబ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడి అయింది. కరోనా వైరస్ రోగులు, డయాబెటిస్ మరియు గుండె జబ్బులు ఉంటే వారికి ప్రాణాలకు ఎక్కువగా ముప్పు ఉంటుంది అని చెప్పారు.
వారిలో ఉండే కొలెస్ట్రాల్ ప్రమాదకరంగా మారుస్తుంది అని వెల్లడించారు. క్రమంగా ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అని పేర్కొన్నారు. వారు ముందుగా అప్రమత్తం కావాల్సి ఉంటుంది అని, వారి శరీరంలోకి వైరస్ వేగంగా వెళ్ళే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. చికిత్స విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే తీవ్ర ముప్పు ఉండవచ్చు అని పేర్కొన్నారు.