ప్రపంచ దేశాలను ఇప్పటికే కరోనా వైరస్, డెల్టా, ఓమిక్రాన్ తోపాటు ఇటీవల ఫ్రాన్స్ లో వచ్చిన కొత్త వేరియంట్లు పట్టి పీడిస్తున్నాయి. తాజా గా మరో కొత్త వేరియంట్ వచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. డెల్టాక్రాన్ అనే ఈ కొత్త వేరియంట్ మిడిల్ ఈస్ట్ దేశం అయిన సైప్రస్ లో వెలుగు చూసిందని శాస్త్ర వేత్తలు ప్రకటించారు. ఈ డెల్టాక్రాన్ అనే కొత్త వేరియంట్ డెల్టా, ఓమిక్రాన్ అనే రెండు వేరియంట్ల నుంచి మ్యూటేషన్ చెందినట్టు శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.
ఈ డెల్టాక్రాన్ అనే కొత్త వేరియంట్ బారీన సైప్రస్ దేశానికి చెందిన 25 మంది పడ్డారని శాస్త్రవేత్తలు గుర్తించారు. కాగ డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లతో మ్యూటేట్ అయి కొత్తగా ఏర్పడ్డ డెల్టాక్రాన్ వేరియంట్ తో ఎక్కువ ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు అంతర్జాతీయ మీడియాతో తెలిపారు. ఈ వేరియంట్ గురించి ప్రస్తుతానికి భయం అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగ ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఇలా మ్యూటేట్ అయిన వేరియంట్లే ఎక్కువ హానీ చేస్తున్నాయి. ఇటీవల వచ్చిన ఓమిక్రాన్ తోనే ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందనన్న విషయం తెలిసిందే.