ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయ్యాక, అధ్యక్షుడు అష్రాఫ్ ఘనిపై అనేక ఆరోపణలు వచ్చాయి. దేశం విడిచి పారిపోయాడని, పారిపోయేటపుడు నాలుగు కార్ల నిండా డబ్బులు మూటకట్టుకున్నాడని, ఒక హెలికాప్టర్ కూడా పట్టుకుపోయాడని వార్తలు వచ్చాయి. అటు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి కూడా అధ్యక్షుడు ఘనిపై వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఈ వ్యాఖ్యలను ఖండించిన ఘని, ఒక వీడియో రిలీజ్ చేసారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకున్న ఘని, దేశం విడిచి రావడానికి కారణాలను వివరించాడు.
మీరందరూ అనుకున్నట్టు డబ్బు కట్టలతో పారిపోలేదని, కనీసం నేను వేసుకున్న షూ కూడా మార్చలేదని, కాళ్ళకి ఉన్న చెప్పులతోనే బయలు దేరానని చెప్పుకొచ్చాడు. దేశంలో రక్తపాతం చెలరేగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని, అంతేకానీ ఇందులో ఎలాంటి విషయం లేదని, మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ కి వస్తానని చెప్పారు. ఐతే ఎప్పుడు వస్తాననే దానిపై ఇప్పట్లో స్పష్టత ఇవ్వలేనని పేర్కొన్నారు.