అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రోజున సీఎన్‌ఎన్ నెట్‌వర్క్‌పై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. 475 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్ డేల్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. సీఎన్‌ఎన్ నెట్‌వర్క్ తన పరువుకు భంగం కలిగించిందని ఆరోపిస్తూ 29 పేజీలతో కూడిన దావాను ట్రంప్ తరఫున న్యాయవాదులు దాఖలు చేశారు.
సీఎన్‌ఎస్ నెట్‌వర్క్‌కు తనను విమర్శించడంలో సుదీర్ఘ ట్రాక్ రికార్డు ఉందని ట్రంప్ అన్నారు. 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని నెట్‌వర్క్ భయపడి.. ఇటీవల తనపై దాడిని పెంచిందని వాజ్యంలో ఆరోపించారు ట్రంప్. జాత్యహంకారి, రష్యన్ లూకీ, తిరుగుబాటుదారుడు.. హిట్లర్‌గా పేర్కొంటూ తనను అపకీర్తి పాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు.