ఇలాంటి సమయాల్లోనే మనందరం ఏకం కావాలి.. ప్రజలకు పిలుపునిచ్చిన ట్రంప్

-

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆదివారం రోజున దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆయనపై కాల్పులు జరగగా త్రుటిలో ఆయన తప్పించుకున్నారు. అయితే దాడి ఘటనపై ఇప్పటికే స్పందించిన ట్రంప్.. మరోసారి ఈ వ్యవహారంపై స్పందించారు.

మృత్యువు నుంచి దేవుడే తనను రక్షించాడని ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ అన్నారు. త్రుటిలో మృత్యువు నుంచి బయటపడ్డానని పేర్కొన్నారు. ఇలాంటి సమయాల్లోనే మనమంతా ఐక్యంగా నిలబడాలని అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. అమెరికన్లుగా తమ నిజమైన పాత్రను చూపించడం, బలంగా, దృఢంగా ఉండి, చెడు గెలవడానికి అనుమతించకపోవడం చాలా ముఖ్యం అని ట్రంప్​ పేర్కొన్నారు. అంతేకాకుండా తాము భయపడబోమని స్పష్టం చేశారు. మరోవైపు, హత్యాయత్నం ఘటన తర్వాత ట్రంప్​ బాగానే ఉన్నారని ఆయన ప్రచార ప్రతినిధి ఒకరు తెలిపారు.

మరోవైపు ట్రంప్ పై దాడి ఘటనను ఆదేశాధినేతలు, కీలక నేతలతో పాటు ప్రపంచ దేశాల అధినేతలూ తీవ్రంగా ఖండించారు. ఏ రూపంలోని రాజకీయ హింసకైన మన సమాజంలో స్థానం లేదని బ్రిటిష్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version