నేపాల్ నూతన ప్రధానిగా నేడు కేపీ శర్మ ఓలీ ప్రమాణ స్వీకారం

-

చైనా అనుకూలవాది!, సీపీఎన్ -యూఎంఎల్ చైర్మన్ కేపీ శర్మ ఓలీ నేపాల్​ కొత్త ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76-2 ప్రకారం అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, ఓలీని కొత్త ప్రధానమంత్రిగా నియమించారు. నాలుగోసారి ప్రధానిగా నియమితులైన ఓలీ, మంత్రివర్గంతో పాటు సోమవారం (జులై 15వ తేదీ) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల, నేపాల్ ప్రధానిగా ఉన్న పుష్పకమల్‌ దహల్‌ ప్రచండ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన విషయం తెలిసిందే.

నేపాల్​లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో, పాలీ కాంగ్రెస్‌తో ముందస్తుగా చేసుకున్న అధికార బదలాయింపు ఒప్పందం ప్రకారం ప్రచండ, ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి రాగా.. అందుకు ఆయన నిరాకరించారు. దీంతో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలికి చెందిన పార్టీ సీపీఎన్‌-యుఎంఎల్‌ మద్దతు ఉపసంహరణతో ఆ దేశ ప్రభుత్వం కుప్పకూలింది. ఇక యుఎంఎల్, నేపాల్​ కాంగ్రెస్ పార్టీ కలిసి తాజాగా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ప్రధానమంత్రిగా నియమితులైన కేపీ శర్మ ఓలీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version