ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్, భారత్‌లో భూకంపం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం మధ్యాహ్నం 12:17 గంటలకు భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తేలింది. భారతదేశంలోని జమ్మూకశ్మీర్, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయని నివేదికలు వెల్లడించాయి. 130 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించిందని.. అయితే ఈ విపత్తులో ఆస్తి, ప్రాణ నష్టంపై ఎలాంటి సమాచారం అందలేదు.
భారత్, పాకిస్థాన్‌లో చాలా చోట్ల ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల తరచూ భూకంప వార్తలు రావడం ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇతర దేశాల్లో భూకంపం ప్రభావంతో మన దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల తరచూ ఆప్ఘనిస్థాన్‌లో భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. మరోవైపు ఇటీవల మయన్మార్, థాయ్‌లాండ్‌లో చోటుచేసుకున్న భూకంపంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో వేల మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ దేశాల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ భూకంప ధాటి నుంచి ఈ దేశాలు కోలుకోలేదు.