ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ముదిరాజ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ ఫ్యామిలీ చేస్తున్న ఆరోపణలపై ఆయన గాంధీ భవన్ వేదికగా స్పందించారు. కేసీఆర్ ది కల్వకుంట్ల కుటుంబం కాదని కల్వ “కుట్ర”ల కుటుంబం అన్నారు. ఇకనైన సీఎం రేవంత్ పై అసత్యపు ఆరోపణలు చేయడం మానుకోవాలని..లేకుంటే తాము చూస్తూ ఊరుకోమని సాయికుమార్ మండిపడ్డారు.
కేటీఆర్ అసలు తెలంగాణ వ్యక్తే కాదని, తెలంగాణవాది అనే ముసుగులో కేటీఆర్ పదేళ్ల పాటు మంత్రిగా పని చేసి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు.కేటీఆర్ సీఎం రేవంత్‌ను దిగిపోవాలని పదే పదే అంటున్నారని, అలా అనగానే దిగిపోవడానికి సీఎం రేవంత్ కల్వకుంట్ల కుటుంబ వ్యక్తి కాదని గుర్తు చేశారు. రేవంత్ పై ఏది పడితే అది మాట్లాడవద్దని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.