కరోనా వైరస్ లక్షణాలతో దవాఖానల్లో చేరుతున్నవారందరికీ ప్రయోగాత్మక యాంటీ వైరల్ ఔషధం రెమ్‌డెసివిర్‌ను వాడేందుకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతించింది. వైరస్ లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి మాత్రమే ఇప్పటివరకూ ఈ డ్రగ్‌ను ఎఫ్‌డీఏ పరిమితి చేసింది. అయితే, వివిధ స్థాయిల్లో లక్షణాలున్న వారిపై ఇటీవల జరిపిన పరిశోధనలతో సత్ఫలితాలు రావడంతో కరోనాతో దవాఖానల్లో చేరే రోగులందరికీ రెమ్‌డెసివిర్ వాడేందుకు తాజాగా అనుమతించింది.
ఒక మోతాదు లక్షణాలున్న వారికి రెమ్‌డెసివిర్ ఇవ్వగా.. 65 శాతం మంది రోగులు ఐదు రోజుల్లోనే కోలుకున్నట్టు ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో రెమ్‌డెసివిర్‌ను వాడనున్నారు. ఇదిలా ఉండగా.. ప్రపంచం వ్యాప్తంగా కరోనా కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది.