గాల్వాన్ పరిస్థితుల నేపథ్యంలో భారత దేశ ప్రజల సమాచార భద్రత కోసం చైనా దేశానికి సంబంధించిన 59 యాప్స్ ను బ్యాన్ చేసిన సంగతి విదితమే. అయితే ఇందులో భాగంగా ప్రాముఖ్యం చెందిన టిక్ టాక్ యాప్ కూడా ఉంది. అయితే హంకాంగ్ దేశంలో టిక్ టాక్ సంస్థ తమ కార్యకలాపాలను నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టం అమల్లోకి రావడంతో ఈ సంఘటన చోటు చేసుకుంటుందని అర్థమవుతుంది.
ఇప్పటికే ఆ దేశం నుండి అనేక టెక్ కంపెనీలు, ఫేస్ బుక్ కూడా తమ కార్యకలాపాలను వీడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆదేశ వినియోగదారుల డేటాను ప్రభుత్వానికి ఇవ్వాల్సి రావడంతో ఈ నిర్ణయాన్ని వారు తీసుకున్నారు. ఇలాంటి పరిణామాలతో మేము హాంకాంగ్ లో మా యాప్ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు టిక్ టాక్ మాతృ సంస్థ అయిన బైట్ డాన్స్ యొక్క ప్రతినిధి మీడియా పూర్వకంగా తెలిపారు. అయితే ఆ దేశం నుండి టిక్ టాక్ బయటికి రావడం పెద్ద కష్టమేం కాదు. కేవలం అక్కడ లక్షన్నర వినియోగదారులు మాత్రమే ఉండడంతో భయపడాల్సిన అవసరం లేదు.