దాయాది దేశం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ పై తెగ ప్రశంసలు కురిపించాడు. పదవి కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ భారత్ ను పొగడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఆ దేశ పార్లమెంట్ లో ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కొంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఇండియాను పొగుడుతూ పలు వ్యాఖ్యలు చేశాడు. భారత విదేశాంగ విధానం భేష్ అని.. తమ పౌరుల కోసం భారత్ ఎందాకైనా వెళ్తుందని అన్నాడు.
ప్రభుత్వంలో ఇండియన్ ఆర్మీ జోక్యం చేసుకోదని.. భారత ఆర్మీని పొగిడారు. పాక్ ఆర్మీకి డబ్బుల ఇచ్చి ప్రభుత్వాన్ని కాపాడుకోలేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విపక్షాలకు లొంగేది లేదని.. రాజీనామాకు కూడా సిద్ధం అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇస్లామిక్ దేశాల సదస్సు తరువాత ఇమ్రాన్ రాజీనామా చేయాలని పాక్ ఆర్మీ అల్టిమేటం జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతన సంతరించుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ప్రస్తుతం 25 మంది ఎంపీలు, 3గురు మంత్రులు మద్దుతు ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. దాదాపుగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ 172 మంది మద్దతు ఇమ్రాన్ ఖాన్ కు లేదు.