రఫేల్ యుద్ధవిమానాల ఎస్కార్ట్ మధ్య.. ఆర్మీ ప్లేన్ లో భారత్ కు హసీనా

-

బంగ్లాదేశ్‌లో కల్లోల పరిస్థితులపై భారత్ నిఘా ఉంచింది. ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సరిహద్దుల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం రోజున అల్లర్లు తీవ్రరూపంద దాల్చడం.. ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేయడంతో మరింత అప్రమత్తమైంది. ఇక ఆమె భారత్‌కు వస్తున్నారని తెలుసుకున్న మన భద్రతా దళాలు గగనతలంపై నిఘా వేసి ఆమె ప్రయాణించే విమానం సురక్షితంగా భారత్‌లోకి వచ్చేలా చేశాయి.

ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్‌ గగనతలాన్ని భారత వాయుసేన రాడార్లు పరిశీలిస్తూ.. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు అటు నుంచి షేక్ హసీనా ప్రయాణిస్తున్న విమానం రాగానే భారత భూభాగంలోకి అనుమతించాయి. అంతేగాక ఆమె విమానానికి రక్షణ కల్పించేందుకు పశ్చిమ బెంగాల్‌లోని హాసీమారా వైమానిక స్థావరం నుంచి 101 స్వ్కాడ్రన్‌లోని రఫేల్‌ యుద్ధ విమానాలను పంపించాయి. యూపీలోని హిండన్‌ విమానాశ్రయంలో దిగే వరకు భద్రతా ఏజెన్సీలు హసీనా విమానాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలన్నింటినీ భారత వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి, పదాతిదళాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది నిశితంగా పరిశీలించినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version